రాంచరణ్ కు గాయాలురాంచరణ్ కు గాయాలు కావడంతో ఆర్ ఆర్ ఆర్ చిత్ర షూటింగ్ కి మూడు వారాల గ్యాప్ ఇచ్చారు దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి . మాములుగా అయితే పూణే లో ఆర్ ఆర్ ఆర్ చిత్ర షూటింగ్ జరగాలి కానీ రాంచరణ్ కాలికి గాయం కావడంతో సరిగ్గా నడవాలన్నా , పరుగెత్తాలన్నా కూడా కష్టమే దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్ ఆర్ ఆర్ చిత్ర షూటింగ్ ని వాయిదా వేశారు .

రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటించనున్న విషయం తెలిసిందే . ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ రెండు షెడ్యూళ్ల ని హైదరాబాద్ లో పూర్తిచేసుకుంది . అయితే మూడో షెడ్యూల్ ని పూణే లో ప్లాన్ చేయగా అది ఇలా బెడిసి కొట్టింది దాంతో ప్యాకప్ చెప్పారు . 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఆర్ ఆర్ ఆర్ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే .