సమంత – నాగచైతన్య మళ్ళీ హిట్ కొడతారా ?


సమంత – అక్కినేని నాగచైతన్య కలిసి ఇప్పటివరకు నాలుగు చిత్రాల్లో నటించగా మూడు చిత్రాలు రిలీజ్ అయ్యాయి అందులో ఏ మాయ చేసావే , మనం చిత్రాలు బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి అయితే ఆటోనగర్ సూర్య మాత్రం అట్టర్ ప్లాప్ అయ్యింది . ఇక ఇప్పుడు నాలుగో సినిమా ” మజిలీ ” చిత్రం ఈనెల 5 న రిలీజ్ కి సిద్ధమైంది . టీజర్ , ట్రైలర్ లతో మజిలీ చిత్రంపై అంచనాలు పెరిగాయి దాంతో ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు నాగచైతన్య .

సమంత మజిలీ చిత్రంలో నన్ను డామినేట్ చేసిందని అయితే కథానుగుణంగా సినిమా ఉంటుందని దాంతో మజిలీ ని ఆస్వాదించడం ఖాయమని అంటున్నాడు . పెళ్ళికి ముందు మూడు సినిమాల్లో నటించగా రెండు హిట్స్ ఒక ప్లాప్ ని అందుకున్నారు నాగచైతన్య -సమంతలు మరి పెళ్లి అయ్యాక చేస్తున్న ఈ సినిమాతో హిట్ కొడతారా ? చూడాలి .