మోసం చేసిన సినీ నటుడు అరెస్ట్


Actor ramachandrababu arrest in fake documents case

భూమిలో వాటా ఇస్తానని మాయమాటలు చెప్పి ఇవ్వకపోగా సీరియల్ లో భాగస్వామి అంటూ మరింత సొమ్ము తీసుకొని మోసం చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు దాంతో మోసం చేసిన సినీ , టివి నటుడు రామచంద్రబాబు ని అరెస్ట్ చేసారు పోలీసులు . రామచంద్రబాబు చక్రవాకం , ఋతు రాగాలు వంటి సీరియల్ లలో నటించాడు అలాగే టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించాడు .  సంఘటన వివరాలలోకి వెళితే …….

తనకు సంబంధం లేని స్థలం నాదే అంటూ సంతోష్ నగర్ కు చెందిన శ్రీనివాస్ దగ్గరకు వెళ్లి 60 లక్షలు తీసుకున్న రామచంద్రబాబు ఆ స్థలంలో శ్రీనివాస్ కు వాటా ఇవ్వకపోగా సీరియల్ నిర్మాణం అంటూ మరో యాభై లక్షలను తీసుకున్నాడు . అయితే స్థలంలో వాటా ఇవ్వలేదు , డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చిన శ్రీనివాస్ స్థలం దగ్గరకు వెళ్లి చూడగా అది మరొకరి స్థలమని మోసపోయానని తెలుసుకొని పోలీసులను ఆశ్రయించాడు . అయితే ఈ సంఘటన 2009 లో జరిగింది . శ్రీనివాస్ అనే వ్యక్తీ కేసు పెట్టాడని తెలుసుకొని కోర్టుకెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు . ఆ బెయిల్ గడువు తీరడంతో సీసీఎస్ పోలీసులు రామచంద్రబాబు ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు .

English Title: Actor ramachandrababu arrest in fake documents case