బండ్ల గణేష్ పిచ్చి కుక్కతో సమానమాట



Actress Ramya sensational comments on bandla ganesh
బండ్ల గణేష్ పిచ్చి కుక్కతో సమానమని , అతడి గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది సినీ నటి రమ్య . టాలీవుడ్ లో పలు చిత్రాల్లో వ్యాంప్ పాత్రల్లో నటించిన రమ్య తాజాగా బండ్ల గణేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది . అసలు బండ్ల గణేష్ కు ఏమి అనుభవం ఉందని అధికార ప్రతినిధి పదవి ఇచ్చారని , కేసీఆర్ పై అవాకులు చవాకులు పేలితే చీల్చి చెండాడుతారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది రమ్య .

బండ్ల గణేష్ తెలంగాణ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే . కేసీఆర్ ఓడిపోవడం ఖాయమని , ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే బ్లేడ్ తో  నా గొంతు కోసుకుంటానని వ్యాఖ్యానించాడు . అయితే తెలంగాణ ఎన్నికల్లో ఫలితాలు వచ్చాయి మళ్ళీ భారీ మెజారిటీ తో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాడు దాంతో బండ్ల గణేష్ జాడ లేకుండాపోవడంతో రమ్య బండ్ల పై నిప్పులు చేరగడమే కాకుండా కుక్కతో పోల్చింది .

English Title: Actress Ramya sensational comments on bandla ganesh