హీరోయిన్ ని అవమానించిన యువకులు


Actress Shamita shetty was verbally abused in road accident

బాలీవుడ్ హీరోయిన్ షమితా శెట్టి ని ఓ ముగ్గురు యువకులు ఘోరంగా అవమానించారు . ఈ సంచలన సంఘటన థానే లో జరిగింది . షమితా శెట్టి కారులో ప్రయాణిస్తుండగా ఓ బైక్ పై ముగ్గురు యువకులు వేగంగా వెళ్తూ షమితా శెట్టి కారుని డీ కొట్టడమే కాకుండా తప్పంతా షమితా శెట్టి దే అన్నటుగా దూషిస్తూ మీద మీదకు రావడమే కాకుండా గొడవ చేసారు . అంతేకాదు షమితా శెట్టి డ్రైవర్ ని కూడా కొట్టారు . అలాగే షమితా శెట్టి ని తిట్టారు దాంతో థానే లోని రాబోడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది షమితా .

కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా బైక్ వివరాలను కనుక్కున్నారు అయితే ఇంకా ఆ ముగ్గురు యువకుల జాడ దొరకలేదు దాంతో ఆ యువకుల కోసం గాలిస్తున్నారు . ఈ షమితా శెట్టి హీరోయిన్ శిల్పా శెట్టి చెల్లెలు . అక్కా చెల్లెలు ఇద్దరూ బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా నటించారు .

English Title: Actress Shamita shetty was verbally abused in road accident