అల్లు అర్జున్ చిత్రం పేరు అలకనంద ?అల్లు అర్జున్త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో తాజాగా ఓ చిత్రం ప్రారంభమైన విషయం తెలిసిందే . అయితే ఆ చిత్రానికి” అలకనంద ” అనే టైటిల్ ని పెట్టనున్నట్లు సమాచారం . గతంలో అల్లు అర్జున్ – త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో జులాయి , సన్నాఫ్ సత్యమూర్తి అనే హిట్ చిత్రాలు వచ్చాయి దాంతో ఈ సినిమాపై అంచనాలు ఎక్కువయ్యాయి .

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన చిత్రాలకు ” అ ” సెంటిమెంట్ ఉంది . అయితే అన్ని సినిమాలు అ అక్షరంతోనే చేయలేదు కానీ ఎక్కువగా చేసిన చిత్రాలు మాత్రం అ అక్షరంతోనే . అతడు , అత్తారింటికి దారేది , అజ్ఞాతవాసి , అ … ఆ , అరవింద సమేత దాంతో సెంటిమెంట్ ప్రకారం అలకనంద అనే టైటిల్ ని పరిశీలిస్తున్నాడట . అంతేకాదు కథ ప్రకారం పూజా హెగ్డే పాత్ర పేరు కూడా అలకనంద కావడంతో ఆ దిశగా ఆలోచన చేస్తున్నాడట త్రివిక్రమ్ .