అనసూయ కు కోపం వచ్చింది


Anasuya counters on netizens

హాట్ భామ అనసూయ కు కోపం వచ్చింది అంతే నెటిజన్ల పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది . ఇంతకీ అనసూయ కు కోపం రావడానికి కారణం ఏంటి ? నెటిజన్లు అనసూయ ని ఏమన్నారు ? అసలు విషయం ఏంటంటే …… పుల్వామా లో భారత సైనికులను ఊచకోత కోసిన విషయం తెలిసిందే . అయితే జాతి యావత్తు ఆ సంఘటనపై మండిపడుతుండగా అనసూయ దానికి సంబంధించి ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు సరికదా ……. కాస్త ఎక్స్ పోజింగ్ చేస్తూ ఫోటో షూట్ చేసింది .

 

అంతేనా ఆ ఫోటోలను ట్వీట్ చేసింది కూడా దాంతో నెటిజన్లకు ఎక్కడా లేని కోపం వచ్చింది . ఇంకేముంది అనసూయ ని టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున విమర్శలు చేసారు . దానికి అనసూయ కూడా తక్కువేమి తినలేదు …… పుల్వామా సంఘటనకు నా ట్వీట్ లకు సంబంధం ఏముంది ? అది జరిగింది కదా అని స్నానం చేయడం మానేసారా ? తినడం మానేసారా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీ పని మీరు చూసుకోండ్రా అంటోంది .

English Title: Anasuya counters on netizens