నటి ఓవియా పై కేసు నమోదు


Another Case file on Oviya

తమిళ బిగ్ బాస్ లో పాల్గొని సంచలనం సృష్టించిన వివాదాస్పద భామ ఓవియా పై ఇటీవలే పలు కేసులు నమోదు అయ్యాయి 90 ఎం ఎల్ చిత్ర వివాదం గురించి . తాజాగా మరోసారి మరో కేసు నమోదు చేసారు పోలీసులు . ఇంతకుముందు 90 ఎం ఎల్ చిత్ర విషయంలో కేసు నమోదు కాగా ఇపుడేమో పొల్లాచ్చి సంఘటన ని ఉదహరిస్తూ ఫిర్యాదు చేసారు కాగా పెద్ద ఎత్తున వచ్చిన ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసారు పోలీసులు .

 

పొల్లాచ్చి లో ఇటీవలే ఒళ్ళు గగుర్పొడిచే సంఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే . 100 మందికి పైగా అమ్మాయిలను ప్రేమ పేరుతో మోసం చేసి , వాళ్లపై మూకుమ్మడి  అత్యాచారాలు చేసి వీడియో కూడా తీసి మళ్ళీ మళ్ళీ బెదిరించి అత్యాచారం చేస్తున్న గ్యాంగ్ ని అరెస్ట్ చేసారు పోలీసులు . సమాజంలో ఇలాంటి సంఘటనలు జరగడానికి కారణం ఓవియా నటించిన అసభ్యకరమైన సన్నివేశాలే అంటూ ఫిర్యాదు చేసారు . 90 ఎం ఎల్ అనే చిత్రంలో విచ్చలవిడిగా శృంగార సన్నివేశాల్లో నటించింది ఓవియా .

English Title : Another Case file on Oviya