అగస్ట్‌లో బాలకృష్ణ సినిమా షూటింగ్‌ ప్రారంభం…


బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో సినిమా అంటేనే ఫుల్‌ క్రేజ్‌ ఉంటుంది. ‘సింహా’, ‘లెజెండ్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను అందించిన ఈ కాంబినేషన్‌ ఇప్పుడు హ్యాట్రిక్‌ ఇవ్వడానికి రెడీ అవుతోంది. గురువారం బోయపాటి శ్రీను పుట్టినరోజు. ఈ సందర్భంగా జరిగిన వేడుకల్లో బాలకృష్ణతో చేయనున్న సినిమా గురించి ఆయన చెప్పారు. ఆగస్ట్‌ రెండో వారంలో షూటింగ్‌ ఆరంభించి, వచ్చే ఏడాది వేసవికి విడుదల చేయాలనుకుంటున్నామని బోయపాటి శ్రీను తెలిపారు. ఇండస్ట్రీలోని పలువురు నిర్మాతలు, దర్శకులతో పాటు ఎంతోమంది టెక్నీషియన్లు ఆయనకు అభినందనలు తెలియచేశారు. ఆయన జన్మదిన వేడుకల్లో పలువురు సినీ ప్రముఖులు పాల్గొని, శుభాకాంక్షలు తెలియజేశారు.