తమిళ అర్జున్ రెడ్డి కి హీరోయిన్ దొరికింది


 Banita Sandhu to romance Dhruv Vikram in Arjun Reddy remake

టాలీవుడ్ లో ప్రభంజనం సృష్టించిన చిత్రం అర్జున్ రెడ్డి . కాగా ఆ చిత్రాన్ని తమిళ్ లో బాల దర్శకత్వంలో తమిళ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా రీమేక్ చేసారు . హీరోయిన్ గా మేఘా చౌదరి నటించింది . అయితే సినిమా రష్ చూసుకున్నాక అనుకున్న స్థాయిలో సినిమా రాలేదని తీసిన సినిమా మొత్తాన్ని పక్కన పెట్టేసారు . మళ్ళీ రీ షూట్ చేయడానికి సిద్ధమయ్యారు . హీరోయిన్ గా మేఘా చౌదరి కాకుండా బాలీవుడ్ భామ బానిట సంధు ని ఎంపిక చేసారు .

 

అర్జున్ రెడ్డి చిత్రం అంటే బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమా , శృంగార సన్నివేశాలు ఉన్న సినిమా కావడంతో మేఘా కంటే బానిట సంధు అయితేనే బాగుంటుందని ఫిక్స్ అయ్యారట అందుకే ఆ భామని ఎంపిక చేశారట . త్వరలోనే తమిళ అర్జున్ రెడ్డి వర్మ షూటింగ్ ప్రారంభం కానుంది .

 

English Title: Banita Sandhu to romance Dhruv Vikram in Arjun Reddy remake