RRR లో మరో స్టార్ హీరో ?


Bollywood star hero Ajay devgan in RRR

ఎన్టీఆర్ , చరణ్ ల కాంబినేషన్ లో ఎస్ ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ” ఆర్ ఆర్ ఆర్ ” . డివివి దానయ్య 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మరో స్టార్ హీరో కూడా నటించనున్నట్లు తెలుస్తోంది . ఆర్ ఆర్ ఆర్ చిత్రం ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ , హిందీ బాషలలో కూడా విడుదల అవుతుంది కాబట్టి బాలీవుడ్ స్టార్ ని కూడా తీసుకుంటే బాగుంటుంది అని భావించిన జక్కన్న బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవ్ గన్ ని మరో కీలక పాత్రకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది . బాలీవుడ్ లో అజయ్ దేవ్ గన్ స్టార్ హీరో అన్న విషయం తెలిసిందే .

ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించడానికి జక్కన్న మహా ప్లాన్ వేస్తున్నాడు అందులో భాగంగానే అజయ్ దేవ్ గన్ అని తెలుస్తోంది . బాహుబలి తో తన మార్కెట్ ని వరల్డ్ వైడ్ గా పెంచుకున్న జక్కన్న తన తదుపరి చిత్రాలన్నీ ఒక్క భారత్ లోనే కాకుండా ఇతర దేశాలలో కూడా పెద్ద ఎత్తున విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు . ఎన్టీఆర్ – చరణ్ లకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నప్పటికీ అది కేవలం తెలుగు వాళ్ళ వల్లే ! కానీ ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ వల్ల మరింతగా ఖ్యాతిని ఆర్జించడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ వర్గాలు .

English Title: Bollywood star hero Ajay devgan in RRR