మహేష్ హీరోయిన్ పై చీటింగ్ కేసు


Cheating case files on Ameesha patel

మహేష్ బాబు సరసన నాని చిత్రంలో నటించిన బాలీవుడ్ భామ అమీషా పటేల్ పై చీటింగ్ కేసు నమోదు అయ్యింది . అంతేకాదు మార్చి 12 లోగా కోర్టు కి వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్  కోర్టు . 2016 లో ఓ పెళ్లి లో డ్యాన్స్ చేయడానికి ఒప్పుకుందట అమీషా పటేల్ . అందుకు గాను 11 లక్షలు డిమాండ్ చేయడంతో ఆమేరకు డబ్బులు ఇచ్చాడు నిర్వాహకుడు  పవన్ శర్మ .

 

అయితే తీరా సమయానికి పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేయలేదు సరికదా మరో రెండు లక్షలు ఇవ్వాల్సిందిగా కోరిందట దాంతో ఖంగుతిన్న పవన్  తిరిగి ఇవ్వాల్సిందిగా అమీషా పటేల్ ని కోరాడట కానీ అమీషా డబ్బులు ఇవ్వకుండా మరోసారి అడిగితె చంపేస్తామని హెచ్చరికలు జారీ చేయడంతో పోలీసులను ఆశ్రయించాడు . దాంతో అమీషా పై కేసు నమోదు చేసారు . ఇంకేముందు మార్చి 12 లోపు అమీషా పటేల్ కోర్టు ముందు హాజరు కావాల్సింది . టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , బాలకృష్ణ , ఎన్టీఆర్ ల సరసన నటించింది ఈ బాలీవుడ్ భామ .

English Title: Cheating case files on Ameesha patel