సురేందర్ రెడ్డి పై ఫైర్ అయిన చిరంజీవి


Chiranjeevi fires on surendar reddy

మెగాస్టార్ చిరంజీవి దర్శకులు సురేందర్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్లో గుసగుసలు వినబడుతున్నాయి . తాజాగా ఈ ఇద్దరూ కలిసి సైరా ….. నరసింహారెడ్డి చిత్రానికి పనిచేస్తున్న విషయం తెలిసిందే . చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది అయితే షూటింగ్ సమయంలో చరణ్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందట ! చరణ్ అయితే అందరినీ సమన్వయం చేస్తూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చేస్తాడట ! అయితే అతడికి వినయ విధేయ రామ షూటింగ్ ఉండటంతో సైరా నరసింహారెడ్డి లొకేషన్ లో లేకుండా పోయాడు దాంతో చిన్న మిస్ అండర్ స్టాండింగ్ తో చిరు సురేందర్ రెడ్డి పై అందరి ముందే తిట్టేసాడట దాంతో సురేందర్ రెడ్డి చిన్న బుచ్చుకున్న్దాడట .

సురేందర్ రెడ్డి బాగా ఫీల్ కావడంతో చరణ్ కు ఈ విషయం తెలిసి అతడ్ని కూల్ చేసాడని టాక్ . అంతేకాదు చిరు కి సురేందర్ రెడ్డి పై కోపం రావడానికి మరో కారణం కూడా ఉందట . అనుకున్న విధంగా ఔట్ పుట్ వస్తుందన్న నమ్మకం చిరులో లేదట ! ఆ అపనమ్మకంతో కూడా డైరెక్టర్ పై చిందు లేసాడని టాక్ . మొత్తానికి చిరంజీవి ఈ వయసులో ఎక్కువగా కష్టపడుతుండటంతో కాబోలు అలా విసుక్కుంటున్నారు అంటూ వినిపిస్తోంది .

English Title: Chiranjeevi fires on surendar reddy