వివాదాస్పదమైన హన్సిక పోస్టర్


Controversy on Hansika's maha' first look
Hansika

హాట్ భామ హన్సిక నటించిన మహా చిత్ర పోస్టర్ వివాదాస్పదం అయ్యింది . హన్సిక యాభయ్యవ చిత్రంగా రూపొందుతున్న మహా చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ని నిన్న విడుదల చేసారు . అయితే ఆ లుక్ ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది ఎందుకంటే కాషాయ వస్త్రాల్లో ఓ మహారాజా చెయిర్ లో కూర్చున్న భంగిమ వివాదాస్పదంగా ఉంటే అంతకుమించి ధూమపానం చేస్తూ మరింత వివాదాన్ని రాజేసింది హన్సిక .

కొత్త దర్శకుడు యు ఆర్ జెమిల్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు . హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించిన ఈ భామ ప్రస్తుతం తమిళంలోనే ఎక్కువ చిత్రాలు చేస్తోంది . కానీ హీరోయిన్ గా పరిచయం అయ్యింది మాత్రం టాలీవుడ్ లోనే . హిందీలో బాలనటిగా పలు చిత్రాల్లో నటించిన హన్సిక తాజా చిత్రం మహా వివాదాన్ని రాజేస్తోంది . హన్సిక పోస్టర్ పై పలువురు మండిపడుతున్నారు హిందూ వాదులు . ధూమపానం దండిగా లాగిస్తూ హన్సిక పెట్టిన స్టెప్పు వివాదాస్పదం అయ్యింది , ఈ వివాదంతో మహా చిత్రానికి క్రేజ్ రావడం ఖాయంగా కనిపిస్తోంది .

English Title: Controversy on Hansika’s maha’ first look