లక్ష్మీస్ ఎన్టీఆర్ కు క్రేజ్


Craze for Lakshmi's NTR 

ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రంలో చంద్రబాబు నాయుడు హీరో అనేలా చూపించడంతో వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది . ఎన్టీఆర్ కథానాయకుడు ప్లాప్ కాగా ఈరోజు రిలీజ్ అయిన ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రానికి కూడా అంతగా ఓపెనింగ్స్ లేవు దానికి తోడు సినిమాలో చంద్రబాబు నాయుడు పాత్ర హైలెట్ గా నిలిచింది .

 

అయితే ఎవరు అవునన్నా కాదన్నా 1995 లో ఎన్టీఆర్ ని ముఖ్యమంత్రి పదవి నుండి దించేసింది చంద్రబాబు నాయుడే ! అందుకు సహకరించింది హరికృష్ణ , బాలకృష్ణలు . ఇవన్నీ ఇప్పటి జనాలకు బాగా తెలుసు అలాంటిది ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రంలో చంద్రబాబు నాయుడు ని మహానాయకుడు గా చూపించారు దాంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి . ఆ విమర్శలకు మరింత ఊతమిచ్చేలా జగన్ మీడియా ఉండనే ఉంది . దాంతో వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి క్రేజ్ పెరిగింది .

English Title: Craze for Lakshmi’s NTR