హిట్ అవుతుందా అనే భయం పట్టుకుందట


Dil raju affraid of pongal fighting with F2
Dil raju

సంక్రాంతి బరిలో ” ఎఫ్ 2” చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు దిల్ రాజు , అయితే ఈ సినిమా అయినా హిట్ అయి తన పరువుని , బ్యానర్ పేరుని కాపాడుతుందా ? అన్న భయం పట్టుకుందట నిర్మాత దిల్ రాజుకు . ఈ ఏడాది అంటే 2018 సంవత్సరం దిల్ రాజు కు అంతగా కలిసి రాలేదు . చేసిన చిత్రాలు వరుసగా ఘోర పరాజయాలు చవిచూశాయి . 2018 ప్రథమార్థం ఫరవాలేదు కానీ ద్వితీయార్థం లో మాత్రం దిల్ రాజుకు ముచ్చెమటలు పట్టాయి వరుస పరాజయాలతో .

2019 సంక్రాంతి బరిలో ఇప్పటికే బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ వస్తుండగా రాంచరణ్ నటిస్తున్న వినయ విధేయ రామ చిత్రం కూడా విడుదల అవుతోంది . అలాగే రజనీకాంత్ నటించిన పెట్టా చిత్రం కూడా విడుదలకు సిద్ధం అవుతోంది అంటే మూడు భారీ చిత్రాల నడుమ ఎఫ్ 2 విడుదలైతే హిట్ అవుతుందా ? అన్న భయం నెలకొందట దిల్ రాజుకు . అయితే అంత భయం ఉన్నప్పటికీ సంక్రాంతి కి ఎఫ్ 2 ని విడుదల చేయడానికే మొగ్గు చూపిస్తున్నాడు ఎందుకంటే …… సంక్రాంతి సెలవులు ఒక కారణం అయితే ఫ్యామిలీ ఆడియన్స్ తప్పకుండా ఎఫ్ 2 కి ప్రాధాన్యత ఇస్తారని నమ్మకంగా ఉన్నాడట . ఏమో జనవరి 12న విడుదలైతే కానీ అసలు విషయం తెలీదు .

English Title: Dil raju affraid of pongal fighting with F2