ఆ నిర్మాతకు వార్నింగ్ ఇచ్చిన దిల్ రాజు


Dil raju warns small producer

రజనీకాంత్ నటించిన పేట చిత్రాన్ని సడెన్ గా సంక్రాంతి కి రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు , ఇప్పటికే మూడు పెద్ద సినిమాల విడుదల ఉంది దాంతో ఆ మూడు సినిమాలకే థియేటర్ లు సరిపోవడం లేదు ఇక తమిళ డబ్బింగ్ సినిమాకు ఎలా థియేటర్ లు దొరుకుతాయి , అయినా థియేటర్ ల మాఫియా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని ……. అలా మేము కూడా మాట్లాడగలం అంటూ పేట నిర్మాతపై హెచ్చరికలు జారీ చేసాడు నిర్మాత దిల్ రాజు .

జనవరి 9 న ఎన్టీఆర్ కథానాయకుడు , జనవరి 11న వినయ విధేయ రామ , జనవరి 12న ఎఫ్ 2 విడుదల అవుతున్నాయి . అయితే జనవరి 10 న రజనీకాంత్ నటించిన పేట రిలీజ్ చేస్తున్నాడు వల్లభనేని అశోక్ . దాంతో థియేటర్ ల సమస్య వచ్చింది . తెలుగు చిత్రాలకు థియేటర్ లు ముందే ఫిక్స్ అయ్యాయి కానీ రజనీకాంత్ సినిమాకు థియేటర్ లు లేకుండా పోయాయి దాంతో మాఫియా అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు దిల్ రాజు కు , అల్లు అరవింద్ కు సురేష్ బాబు కి కోపం వచ్చింది అందుకే దిల్ రాజు ఘాటుగా రిప్లయ్ ఇచ్చాడు .

English Title: Dil raju warns small producer