అనిల్ రావిపూడి రెమ్యునరేషన్ పెంచాడటDirector Anil ravipudi hikes his remuneration

ఎఫ్ 2 సంక్రాంతి బరిలో దిగి సంచలన విజయం సాధించడంతో ఒక్కసారిగా అనిల్ రావిపూడి దశ తిరిగింది . పటాస్ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన అనిల్ రావిపూడి మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ కొట్టాడు , ఆ తర్వాత సుప్రీమ్ చిత్రంతో మరో హిట్ ఆ తర్వాత రాజా ది గ్రేట్ చిత్రంతో హ్యాట్రిక్ ని దిగ్విజయంగా పూర్తిచేసి అంచనాలు పెరిగేలా చేసాడు . ఇక ఎఫ్ 2 తో స్టార్ డైరెక్టర్ ల లిస్ట్ లో చేరిపోయాడు అనిల్ రావిపూడి .

 

దాంతో తన రెమ్యునరేష్ ని భారీగా పెంచాడట ! ఇంతకుముందు 5 కోట్లు తీసుకుంటే ఎక్కువ కానీ ఇప్పుడు మహేష్ బాబు తో సినిమా చేస్తున్నాడు కదా ! అందుకే తన రేంజ్ పెరిగింది కాబట్టి రెమ్యునరేషన్ కూడా పెంచాలని డిసైడ్ అయ్యాడట అందుకే పది కోట్లు చెబుతున్నాడట . అనిల్ లో వర్త్ ఉంది కాబట్టి 9 కోట్ల వరకు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారట నిర్మాతలు .

English Title: Director Anil Ravipudi hikes his remuneration