అల్లు అరవింద్ ఆ డైరెక్టర్ని మోసం చేశాడట


Director shocked with allu aravind

అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఓ డైరెక్టర్ ని నమ్మించి మోసం చేసాడట ! జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ” ప్రేమెంత పనిచేసే నారాయణ ” . తన తనయుడిని హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ రిలీజ్ చేస్తానని మాట ఇచ్చాడట ! అయితే రిలీజ్ సమయం దగ్గర పడిన సమయంలో నేను రిలీజ్ చేయలేను కానీ మరో వ్యక్తిని అప్పగిస్తాను అంటూ వేరే డిస్ట్రిబ్యూటర్ ని అప్పగించాడట .

 

అతడేమో తక్కువ థియేటర్ లలో రిలీజ్ చేసాడు , దాంతో కక్కలేక మింగలేక ఇబ్బందిపడుతున్నాడు పాపం జొన్నలగడ్డ శ్రీనివాసరావు . ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు కో డైరెక్టర్ గా పనిచేసాడు జొన్నలగడ్డ . 30 ఏళ్లకు పైగా అనుబంధం సినిమారంగంలో అలాంటిది తన కొడుకు హీరోగా నటించిన చిత్రాన్ని సక్రమంగా రిలీజ్ చేసుకోలేకపోయానే అని బాధపడుతున్నాడు .  అల్లు అరవింద్ సినిమా రిలీజ్ చేస్తున్నాడు కదా ! ఇక ఇబ్బంది ఏముందని అనుకున్నాడట కానీ చివరి నిమిషంలో అల్లు అరవింద్ హ్యాండ్ ఇవ్వడంతో మోసపోయానని బాధపడుతున్నాడు పాపం .

English Title: Director shocked with allu aravind