మజిలీ పై ఆశలు పెట్టుకున్న లిప్ లాక్ భామ


Divyanka kaushik hopes on Majili

మజిలీ చిత్రంలో నాగచైతన్య తో లిప్ లాక్ ఇస్తూ సంచలనం సృష్టించిన భామ దివ్యంకా కౌశిక్ . తాజాగా ఈ భామ మీడియా ముందుకు వచ్చి మజిలీ చిత్ర విశేషాలను వెల్లడించింది . నాగచైతన్య , సమంత , దివ్యంకా కౌశిక్ నటించిన మజిలీ ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది . ఢిల్లీ కి చెందిన ఈ భామ పలు యాడ్స్ లలో నటించింది . ఫెయిర్ అండ్ లవ్లీ తో పాటుగా హీరో హోండా యాడ్ లలో నటించిన ఈ భామని మజిలీ కోసం టాలీవుడ్ కు తీసుకొచ్చారు శివ నిర్వాణ .

 

తమిళంలో సిద్దార్ట్ హీరోగా ఓ సినిమా చేస్తున్నానని , అయితే మజిలీ మాత్రమే రిలీజ్ అవుతున్న నా మొదటి సినిమా అంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది . అంతేకాదు నాగచైతన్య , సమంత లు చాలామంచి వారని ……. మంచి సలహాలు ఇచ్చారని , ఇక నాగచైతన్యతో నటించడం చాలా ఉత్సాహాన్ని ఇచ్చిందని అంటోంది . అంతేగా …. అంతేగా ….. చైతూ కు లిప్ లాక్ ఇచ్చి మజా ఆస్వాదించిందిగా .

English Title : Divyanka kaushik hopes on Majili