పవన్ కళ్యాణ్ పై సెటైర్ వేసిన రాజశేఖర్


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై సెటైర్ వేసాడు సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ . తాజాగా కల్కి ట్రైలర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే . ఆ ట్రైలర్ లో మొదటగా చివరగా వచ్చే డైలాగ్స్ అన్నీ పవన్ కళ్యాణ్ పై వేసిన సెటైర్ లే ! ”ఏం చెప్తిరి ….. ఎం చెప్తిరి ” తో మొదలై రాజశేఖర్ డూప్ లా గబ్బర్ సింగ్ చిత్రంలో నటించిన నటుడి ని ఏంట్రా ఆ ఊపుడు అంటూ తన్నే సీన్ కూడా పవన్ కళ్యాణ్ పై చేసిన విమర్శలే !

గబ్బర్ సింగ్ లో పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ లో అలీ చేత ఏం చెప్తిరి ఏం చెప్తిరి అనే డైలాగ్ చెప్పిస్తాడు పవన్ అలాగే రాజశేఖర్ డూప్ చేత రోజ్ రోజ్ అనే పాటకు డ్యాన్స్ చేయిస్తాడు ఇక చివరలో రోజా నా ? కూజానా ? అంటూ రాజశేఖర్ ని అలాగే జీవితలను ఆ చిత్రంలో అవమానించాడు పవన్ అందుకే ఇన్నాళ్లకు కల్కి చిత్రంలో పవన్ కళ్యాణ్ పై సెటైర్ వేసే ఛాన్స్ తీసుకున్నాడు రాజశేఖర్ . మొదటి నుండి రాజశేఖర్ కు అలాగే మెగా కుటుంబానికి అంతగా పొసగడం లేదు అన్న విషయం తెలిసిందే . ఇక కల్కి చిత్రాన్ని ఈనెల 24 న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .