ఎఫ్ 2 రివ్యూ


F2 Fun and Frustration Movie Review

ఎఫ్ 2 రివ్యూ :
నటీనటులు : వెంకటేష్ , వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత : దిల్ రాజు
దర్శకత్వం : అనిల్ రావిపూడి
రేటింగ్ : 3/ 5
రిలీజ్ డేట్ : 12 జనవరి 2019

వెంకటేష్తమన్నా , వరుణ్ తేజ్మెహరీన్ ల కాంబినేషన్ లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ” ఎఫ్ 2 ” . సంక్రాంతి బరిలో దిగిన ఈ ఎఫ్ 2 ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది చూద్దామా !

కథ :

ఎం ఎల్ ఏ దగ్గర పీఏ గా పనిచేసే వెంకీ ( వెంకటేష్ ) హారిక ( తమన్నా ) ని పెళ్లి చేసుకుంటాడు . అయితే పెళ్ళాం పెట్టే ఇబ్బందులతో సతమతం అవుతుంటాడు వెంకీ , హారిక చెల్లెలు హనీ ( మెహరీన్ ) ని ప్రేమిస్తాడు వరుణ్ యాదవ్ ( వరుణ్ తేజ్ ). పెళ్ళాం అంటే భయపడే వెంకీ కి ఉచిత సలహా ఇస్తాడు వరుణ్ , పెళ్లాలను ఎలా హ్యాండిల్ చేయాలో చూపిస్తా అంటూ వెంకీ చెప్పినా వినకుండా పెళ్ళికి సిద్ధపడతాడు . కట్ చేస్తే వెంకీ చెప్పిందే నిజమని పెళ్ళాం అంటే దెయ్యం అని భావించి పక్కింటి వాడి సలహాతో ఫారిన్ పారిపోతారు వెంకీ , వరుణ్ లు . వాళ్లకు బుద్ది చెప్పడానికి పెళ్ళాలు ఆడిన నాటకం ఏంటి ? అది ఎలా రక్తికట్టింది ? చివరకు ఏమైంది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్:

వెంకటేష్
వరుణ్ తేజ్
ఎంటర్ టైన్ మెంట్

డ్రా బ్యాక్స్ :

కథ , కథనం
సెకండాఫ్

నటీనటుల ప్రతిభ :

వెంకటేష్ అద్భుతమైన కామెడీ టైమింగ్ ఉన్న హీరో అన్న విషయం తెలిసిందే . తాజాగా ఎఫ్ 2 లో మరోసారి కామెడీతో అలరించాడు వెంకీ . ఫన్ తో పాటు ఫ్రస్టేషన్ ని అద్భుతంగా పలికించి మెప్పించాడు వెంకటేష్ . వరుణ్ తేజ్ కూడా తన పాత్రలో లీనమై నటించాడు . తమన్నా , మెహరీన్ లు అందంగా ఉన్నారు అలాగే అంతకంటే అందంగా నటించి కనువిందు చేసారు . మిగిలిన పాత్రల్లో రాజేంద్రప్రసాద్ తో పాటుగా ఆయా నటీనటులు తమతమ పాత్రల్లో మెప్పించారు .

సాంకేతిక వర్గం :

దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటల్లో నాలుగు బాగున్నాయి . అలాగే నేపథ్య సంగీతం తో కూడా అలరించాడు దేవి . విజువల్స్ బాగున్నాయి , నిర్మాణ విలువలు బాగున్నాయి . ఇక దర్శకుడు అనిల్ విషయానికి వస్తే పటాస్ , సుప్రీం , రాజా ది గ్రేట్ చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టిన అనిల్ నాలుగో చిత్రంగా ఈ ఎఫ్ 2 ని రూపొందించాడు . ఫస్టాఫ్ ని ఆసక్తికరంగా మలిచిన అనిల్ సెకండాఫ్ ని మాత్రం ఆ స్థాయిలో రాసుకోలేకపోయాడు , తీయలేకపోయాడు కూడా . సెకండాఫ్ పై కూడా దృష్టి పెట్టి ఉంటే ఇంకా బాగుండేది .

ఓవరాల్ గా :

ఇంటిల్లిపాది హాయిగా ఎంజాయ్ చేసే సినిమా ఎఫ్ 2

English Title: F2 Fun and Frustration Movie Review

                  Click here for English Review