గోపీచంద్, తిరు కాంబినేష‌న్ ఏకే ఎంట‌ర్టైన్మెంట్స్ ప్రొడ‌క్ష‌న్ నెం.18 ప్రారంభం..


Production No 18 Launched
Production No 18 Launched

యాక్ష‌న్ హీరో గోపీచంద్, త‌మిళ్ ద‌ర్శ‌కుడు తిరు కాంబినేష‌న్‌లో.. ఏకే ఎంట‌ర్టైన్మెంట్స్ ప‌తాకంపై నిర్మిస్తున్న సినిమా ఓపెనింగ్ డిసెంబ‌ర్ 22న అనిల్ సుంక‌ర ఆఫీసులో జ‌రిగింది. ఏషియ‌న్ సినిమాస్ సునీల్ ఈ చిత్ర తొలి స‌న్నివేశానికి క్లాప్ కొట్టారు. జనవరి 18 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. 2019, మే నెలలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. స్పై థ్రిల్ల‌ర్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా.. వెట్రి ఫ‌ల‌నిస్వామి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఏకే ఎంట‌ర్టైన్మెంట్స్ ప‌తాకంపై అనిల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

న‌టీన‌టులు:
గోపీచంద్
సాంకేతిక నిపుణులు:
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: తిరు
నిర్మాత‌: రామ బ్ర‌హ్మం సుంక‌ర‌
నిర్మాణ సంస్థ‌: ఏకే ఎంట‌ర్టైన్మెంట్స్
ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూస‌ర్: కిషోర్ గ‌రిక‌పాటి
కో ప్రొడ్యూస‌ర్: అజ‌య్ సుంక‌ర‌, అభిషేక్ అగ‌ర్వాల్
సంగీతం: విశాల్ చంద్ర‌శేఖ‌ర్
సినిమాటోగ్ర‌ఫీ: వెట్రి ఫ‌ళ‌నిస్వామి
ర‌చ‌యిత‌: అబ్బూరి ర‌వి
ఆర్ట్ డైరెక్ట‌ర్: ర‌మ‌ణ‌ వంక‌
కో డైరెక్ట‌ర్స్: దాసం సాయి, రాజ్ మోహ‌న్

పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్

English Title : Gopichand, Thiru and AK Entertainments Production No 18 Launched