నాని కొత్త చిత్రం పేరేంటో తెలుసా


Hero Nani gets defferent title

హీరో నాని తాజాగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే . కాగా ఆ చిత్రానికి ” వ్యూహం ” అనే టైటిల్ ని పెట్టె ఆలోచనలో ఉన్నారు ఆ చిత్ర బృందం . వ్యూహం టైటిల్ కథకు పక్కాగా సరిపోతుంది కాబట్టి దాన్ని రిజిస్టర్ చేయించినట్లుగా తెలుస్తోంది . ఈ చిత్రంలో నాని నెగెటివ్ రోల్ పోషించనున్నాడు అందుకే ఈ వ్యూహం టైటిల్ ని పెడుతున్నట్లుగా తెలుస్తోంది .

 

ఇక నాని తో పాటుగా సుధీర్ బాబు కూడా నటించనున్నాడు ఈ చిత్రంలో . నాని విలన్ కాగా సుధీర్ బాబు మాత్రం హీరో నట ! ఇంతకుముందు నాని – మోహనకృష్ణ ఇంద్రగంటి ల కాంబినేషన్ లో వచ్చిన అష్టా చెమ్మా , జెంటిల్ మెన్ చిత్రాలు హిట్ అయ్యాయి దాంతో హ్యాట్రిక్ కోసం వ్యూహం పన్నుతున్నారు నాని , మోహనకృష్ణ ఇంద్రగంటి . జెర్సీ సినిమా రిలీజ్ అయ్యాక ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది .

Entlish Title: Hero Nani gets defferent title