50 లక్షల విరాళాన్ని ప్రకటించిన తమిళ హీరో సూర్య కుటుంబం


suriya family donate 50 lakhs cyclone gaja

తమిళ హీరో సూర్య తన కుటుంబం తరుపున 50 లక్షల విరాళాన్ని ప్రకటించాడు . తమిళనాట గజ తుఫాన్ భీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే . తమిళనాడు లోని 7 జిల్లాలు భారీగా నష్టపోయాయి అంతేకాదు ప్రాణ నష్టం కూడా జరిగింది దాంతో వాళ్ళని ఆదుకోవాలని భావించిన సూర్య తన కుటుంబం తరుపున 50 లక్షల విరాళం ప్రకటించాడు . సూర్య తో పాటుగా కార్తీ , తండ్రి శివకుమార్ , భార్య జ్యోతిక తరుపున మొత్తం నలుగురి పేరున ఈ యాభై లక్షలు ఇవ్వనున్నారు . సూర్య ఇంతకుముందు పలుమార్లు కూడా విపత్తులు సంభవించినప్పుడు పెద్ద మొత్తంలో విరాళాలు అందించిన విషయం తెలిసిందే .

సూర్య మాత్రమే కాకుండా కార్తీ కూడా పెద్ద మొత్తంలో విరాళాలు ఇస్తున్నాడు . సూర్య , కార్తీ లకు తమిళనాట మాత్రమే కాదు టాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ ఉంది . దాంతో తమిళనాడు తో పాటుగా టాలీవుడ్ లో కూడా ఏకకాలంలో ఈ హీరోల చిత్రాలు విడుదల అవుతున్నాయి . ఇటీవలే కేరళలో భారీ వరదలతో అతలాకుతలం కావడంతో ముందుగా స్పందించింది ఈ ఇద్దరు సోదరులే !

English Title: Hero suriya family donate 50 lakhs cyclone gaja