పుకార్ల ని ఖండించిన విజయ్ దేవరకొండ


టాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ తన పై వస్తున్న పుకార్లని ఖండించాడు . ఇంతకీ విజయ్ దేవరకొండ పైన వస్తున్న పుకార్లు ఏంటో తెలుసా …….. బాలీవుడ్ లో విజయం సాధించిన గల్లీ బాయ్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నాడని . రణ్ వీర్ సింగ్ హీరోగా నటించిన గల్లీ బాయ్ సూపర్ హిట్ అయ్యింది బాలీవుడ్ లో దాంతో ఆ క్యారెక్టర్ కు విజయ్ దేవరకొండ అయితే సూపర్ గా ఉంటుందని భావించిన కొంతమంది గల్లీ బాయ్ రీమేక్ హక్కుల కోసం పొతే పడ్డారు .

అయితే రీమేక్ హక్కులు ఇంకా తీసుకోకుండానే విజయ్ దేవరకొండ హీరో అంటూ ప్రచారం సాగించడంతో నేను గల్లీ బాయ్ రీమేక్ లో నటించడం లేదని తేల్చి చెప్పాడు విజయ్ దేవరకొండ . ప్రస్తుతం ఈ హీరో డియర్ కామ్రేడ్ కోసం కేరళ వెళ్ళాడు . రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న డియర్ కామ్రేడ్ చిత్రాన్ని మే 31 న నాలుగు బాషలలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .