మరో డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తున్న విజయ్ దేవరకొండ


Husharu director Sriharsha next film with Vijay devarakonda

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హుషారు డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తున్నాడట . హుషారు చిత్రంతో తన ప్రతిభని నిరూపించుకున్న శ్రీ హర్ష కొనుగంటి కి విజయ్ దేవరకొండ ని డైరెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ లభించింది . గత ఏడాది విడుదలైన హుషారు దిగ్విజయంగా 50 రోజులను పూర్తిచేసుకుంది . యువతకు నచ్చే అంశాలతో తెరకెక్కిన హుషారు మంచి హిట్ అయ్యింది దాంతో ఆ సినిమాని ఇతర బాషలలో కూడా రీమేక్ చేస్తున్నారు.

 

అయితే ఈ దర్శకుడికి విజయ్ దేవరకొండ తో తన రెండో సినిమా చేసే ఛాన్స్ లభించింది . ఆమేరకు హామీ ఇచ్చాడట ! అయితే ప్రస్తుతం విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ , క్రాంతిమాధవ్ చిత్రాలతో బిజీ గా ఉన్నాడు . అవి పూర్తయ్యాక ఛాన్స్ ఇస్తాడా ? లేక వెయిటింగ్ లిస్ట్ లో పెడతాడా చూడాలి .

English Title: Husharu director Sriharsha next film with Vijay devarakonda