ప్రేమలో మోసపోయానని అంటోంది


I was failed in love says Aishwarya rajesh

ఒకసారి కాదు రెండుసార్లు ప్రేమలో మోసపోయానని అందుకే నేను ఆ విషయంలో దురదృష్టవంతురాలినని అంటోంది హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ . అచ్చ తెలుగమ్మాయి అయిన ఈ ఐశ్వర్య రాజేష్ తెలుగు నటుడు రాజేష్ కూతురు . 80 – 90 వ దశకంలో విలన్ గా హీరోగా పలు చిత్రాల్లో నటించాడు రాజేష్ . అయితే అప్పట్లో చిత్ర పరిశ్రమ చెన్నై లో ఉండటంతో అందరూ చెన్నై లోనే ఉండేవారు అయితే రాజేష్ మరణంతో ఐశ్వర్య సినిమాల్లోకి వచ్చింది .

 

ఇప్పుడు తమిళంలో ఎక్కువ చిత్రాలు చేస్తున్న భామ ఈ ఐశ్వర్య రాజేష్ . తెలుగులో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ఓ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తోంది . ఇక ప్రేమ విషయానికి వస్తే …… ఇంటర్ చదువుతున్న రోజుల్లో ఒక వ్యక్తి ని ప్రేమిస్తే తన స్నేహితురాలే అతడ్ని తన్నుకుపోయిందట ! ఆ తర్వాత మరో వ్యక్తి ని కూడా ప్రేమించిందట కానీ అది కూడా వర్కౌట్ కాలేదని , ప్రేమిస్తే అతడితోనే జీవితం అన్నట్లుగా ఉండాలి కానీ వెంటవెంటనే బ్రేకప్ చెప్పుకోవడం మరొకరిని ప్రేమించడం ఏంటో ? ఈ ప్రేమలు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది ఐశ్వర్య రాజేష్ .

English Title: I was failed in love says Aishwarya rajesh