శ్రీ రెడ్డి ని హత్య చేయబోయారా ?


Is Planning for Sri Reddy murder?

వివాదాస్పద భామ శ్రీ రెడ్డి మరోసారి ఫేస్ బుక్ లో వివాదాస్పద కామెంట్ చేసి వార్తల్లోకి ఎక్కింది . నన్ను హత్య చేయబోయారని అయితే చెన్నై పోలీసులు సకాలంలో స్పందించి నన్ను కాపాడారని వాళ్లకు నా కృతఙ్ఞతలు అంటూ పోస్ట్ చేసి రచ్చ రచ్చ చేసింది . హైదరాబాద్ లో కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసి టాలీవుడ్ ని షేక్ చేసిన ఈ భామ తాజాగా చెన్నై లోని అంబు నగర్ , వలసర వాక్కం లో నివసిస్తోంది .

 

అయితే ఫైనాన్సియర్ సుబ్రమణి అలాగే అతడి అసిస్టెంట్ గోపి శ్రీ రెడ్డి ఇంటికి వచ్చి దాడి చేయడానికి ప్రయత్నించారట దాంతో నాపై హత్యాయత్నం జరిగింది అని అంటోంది . ఇక చెన్నై లో ఎందుకు ఉందంటే పొల్లాచ్చి లో గ్యాంగ్ రేప్ సంఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే . బాధితులకు న్యాయం జరగడానికి నేను పోరాటం చేస్తున్నానని తెలిపింది శ్రీ రెడ్డి . గతకొంత కాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తున్న శ్రీ రెడ్డి ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయంతో సంచలనం సృష్టిస్తూనే ఉంది .

English Title : Is Planning for Sri Reddy murder?