జగన్ ని కలిసిన ఎన్టీఆర్ మామ


Jr. NTR father in law narne srinivasarao meets ys jagan

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు పిల్లనిచ్చిన మామ నార్నే శ్రీనివాస్ ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ ని కలిసాడు దాంతో రాజకీయ వర్గాల్లో సంచలనం అయ్యింది . నార్నే శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు సమీప బంధువు , ఆయనే శ్రీనివాస్ కూతురు ని ఎన్టీఆర్ కు ఇచ్చి పెళ్లి చేయించాడు కానీ ఎక్కడో తేడా కొట్టింది అప్పటి నుండి చంద్రబాబు కు దూరమయ్యాడు .

 

కట్ చేస్తే మరో రెండు నెలల్లో జరగనున్న ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడం , జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని పలు సర్వేలు చెబుతున్న నేపథ్యంలో ఈ ఇద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది . ఇప్పటికే పలువురు నాయకులు తెలుగుదేశం పార్టీని వీడి జగన్ పార్టీలో చేరగా తాజాగా ఎన్టీఆర్ మామ జగన్ ని కలవడం సంచలనంగా మారింది . అయితే నార్నే శ్రీనివాస్ చెబుతున్న దాని ప్రకారం కేవలం మర్యాద పూర్వకంగానే కలిసాను అని అంటున్నాడు ఏమో ! ఎవరికి తెలుసు నార్నే చెప్పింది నిజమేనా ?

English Title: Jr. NTR father in law narne srinivasarao meets ys jagan