టీడీపీ తరుపున ఎన్టీఆర్ ప్రచారం చేయడటJr. ntr not intrested in politics

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపించిన ఈ తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరుపున ప్రచారం చేస్తాడేమో అని ఆశగా ఎదురు చూస్తున్న వాళ్లకు జూనియర్ ఎన్టీఆర్ నుండి సంకేతాలు వెలువడ్డాయట ఇప్పట్లో తెలుగుదేశం పార్టీ తరుపున ప్రచారం చేసేది లేదని . జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాలో బిజీ గా ఉన్నాడు . ఆ సినిమా కోసం కోల్ కతా వెళ్లనున్నారు ఎన్టీఆర్ .

 

అయితే తెలుగుదేశం పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది . ఒకవైపు నరేంద్ర మోడీ , మరోవైపు కేసీఆర్ , కేటీఆర్ లు ఇబ్బంది పెడుతుండగా ఇక్కడ జగన్ నుండి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు చంద్రబాబు . ఇంతమంది తో చంద్రబాబు ఒంటరి పోరాటం చేయాల్సి వస్తోంది దాంతో చంద్రబాబు శక్తి సరిపోతుందా ? మళ్ళీ అధికారంలోకి రాగలుగుతాడా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది . ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో ప్రచారం చేస్తే కొంతవరకు బెటర్ గా ఉండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు . కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తెలుగుదేశం పార్టీ తరుపున ఇప్పట్లో ప్రచారం చేసేది లేదని తేల్చి చెప్పాడట .

English Title : Jr. ntr not intrested in politics