కాజల్ అగర్వాల్ కు ఘోర అవమానం


Kajal Agarwal Fires on Jet Air Ways
Kajal Agarwal

హీరోయిన్ కాజల్ అగర్వాల్ కు ఘోర అవమానం జరిగింది . జెట్ ఎయిర్ వేస్ నిర్వాహకులు స్టార్ హీరోయిన్ అన్న గౌరవాన్ని కూడా ఇవ్వకుండా ఘోరంగా అవమానించారు . కొత్త ఏడాది కావడంతో ఆ వేడుకల కోసం విదేశాలకు వెళ్లిన కాజల్ తిరిగి ఇంటి ముఖం పట్టింది . అందుకోసం జెట్ ఎయిర్ వేస్ ని ఆశ్రయించింది .  అయితే జెట్ ఎయిర్ వేస్ లోని మోయిన్ అనే వ్యక్తి చాలా దురుసుగా , నిర్లక్ష్యంగా వ్యవహరించాడట .

ఇంటర్నేషనల్ టెర్మినల్ వైపు కాకుండా డొమెస్టిక్ టెర్మినల్ వైపు ఫ్లయిట్ ని నిలిపి ఉంచడమే కాకుండా అరగంట సమయం వృథా చేసాడట అంతేకాదు ఎయిర్ పోర్ట్ కి 75 నిమిషాల ముందే వచ్చినప్పటికీ పట్టించుకోలేదని , అసలు ఇలాంటి సిబ్బందిని ఎలా పెట్టుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది కాజల్ అగర్వాల్ . ఈ భామ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేయడంతో ఆమె కోపాన్ని తగ్గించడానికి తగిన చర్యలు తీసుకుంటామంటూ రీ ట్వీట్ చేసింది జెట్ ఎయిర్ వేస్ బృందం .

English Title: Kajal Agarwal Fires on Jet Air Ways