50 కోట్ల వసూళ్లు సాధించిన కాంచన 3


రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ” కాంచన 3 ” . ఏప్రిల్ 19 న విడుదలైన కాంచన 3 నాలుగు రోజుల్లోనే తెలుగు , తమిళ బాషలలో ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించింది . ఇందులో తమిళనాడు లో ఎక్కువ వసూళ్లు వచ్చాయి . తెలుగులో పది కోట్ల కు పైగా వసూళ్లు వచ్చాయి అయితే తమిళ భాషలో మాత్రం వీర లెవల్లో వసూళ్లు సాధిస్తోంది .

హర్రర్ ,కామెడీ నేపథ్యంలో రాఘవ లారెన్స్ పలు చిత్రాలను రూపొందించి విజయాలు సాధిస్తూనే ఉన్నాడు . ఇప్పటికే మూడు చిత్రాలు విడుదలై సంచలనం సృష్టించగా తాజాగా నాలుగో చిత్రంగా రిలీజ్ అయిన కాంచన 3 కి కూడా భారీ వసూళ్లు వస్తున్నాయి . ఇప్పటికే 50 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించడంతో లారెన్స్ కాంచన సిరీస్ లో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు .