మహానటి నీకిది తగునా


Keerthi suresh blunder mistake in sarkar

మహానటి చిత్రంలో నటించిన కీర్తి సురేష్ అచ్చంగా మహానటి సావిత్రి ని గుర్తుకు తెచ్చింది దాంతో అంతకుముందు వరకు కీర్తి సురేష్ కి ఉన్న ఇమేజ్ వేరు , ఆ తర్వాత కీర్తి స్థాయి వేరు అన్నట్లుగా సాగింది దాంతో చిత్రాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటుందేమో అనుకుంటే మహానటి చిత్రం తర్వాతే ఘోరమైన తప్పులు చేస్తోంది కీర్తి సురేష్ . మహానటి చిత్రం వచ్చిన తర్వాత కీర్తి సురేష్ నటించిన చిత్రాలను పరిశీలిస్తే అసలు ఇలాంటి చిత్రాల్లో ఎందుకు నటిస్తోంది ? అన్న అనుమానం రాకమానదు . ఎందుకంటే నటనకు ప్రాధాన్యత లేని పాత్రలు , కనీసం సినిమాలో కాస్త ఎక్కువసేపు అయినా కనిపించే చిత్రాల్లో నటించాలి కానీ హీరోల పక్కన కేవలం పాటలు పాడటానికి , కౌగిలించుకొని ముద్దులు పెట్టడానికి తప్ప మరో అవసరమే లేని చిత్రాల్లో పాత్రల్లో నటించి తన స్థాయిని తగ్గించుకుంటోంది .

మహానటి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టింది కీర్తి సురేష్ కు . అయితే ఆ ఇమేజ్ ని మాత్రం కాపాడుకోలేకపోతోంది ఈ భామ . ఎన్టీఆర్ బయోపిక్ లో మళ్ళీ మహానటి సావిత్రి పాత్ర పోషించమని అడిగితే మరో మాట లేకుండా తోసిపుచ్చింది ఎందుకంటే మహానటి ని మళ్ళీ సృష్టించలేం , ఆ స్థాయి గౌరవం ఆమెకు ఇవ్వాలి …… అంటూ ఏవో కబుర్లు చెప్పింది కట్ చేస్తే ఈ భామ ఇప్పుడు ఒప్పుకున్న సినిమాలు మాత్రం దారుణంగా ఉంటున్నాయి . తాజాగా సర్కార్ చిత్రంతో మరోసారి నిరాశపరిచింది కీర్తి సురేష్ .

English Title: Keerthi suresh blunder mistake in sarkar