వంద కోట్ల క్లబ్ లో కేజీఎఫ్KGF five days Worldwide Collections
yash

కన్నడ హీరో యష్ నటించిన కేజీఎఫ్ చిత్రం వంద కోట్ల క్లబ్ లో చేరింది . కన్నడ చిత్రమే అయినప్పటికీ తెలుగు , తమిళ బాషలలో కూడా విడుదల అయ్యింది ఈ చిత్రం . ఈనెల 21న విడుదలైన కేజీఎఫ్ చిత్రానికి తెలుగులో పెద్దగా పబ్లిసిటీ కూడా చేయలేదు అయినప్పటికీ 7 కోట్ల పై చిలుకు వసూళ్ల ని సాధించడం ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది . తెలుగు రాష్ట్రాలలో అలాగే కర్ణాటక , తమిళనాడు , కేరళ , ఓవర్ సీస్ అన్నీ కలుపుకొని వంద కోట్లకు పైగా వసూల్ చేసాడు యష్ .

యష్ హీరో ఓ సాధారణ బస్ డ్రైవర్ కొడుకు , అయితే యష్ కన్నడంలో క్రేజీ హీరో అయినప్పటికీ అతడి తండ్రి మాత్రం ఇంకా బస్ డ్రైవర్ గానే పనిచేస్తున్నాడు . కేజీఎఫ్ ఛాప్టర్ 1 గా వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధిస్తుండటంతో ఈరోజు హైదరాబాద్ లో భారీ ఎత్తున సక్సెస్ మీట్  ఏర్పాటు చేసారు . ఏరియాల వారీగా కేజీఎఫ్ సాధించిన వసూళ్లు ఇలా ఉన్నాయి .
తెలంగాణ – ఆంధ్రప్రదేశ్     –  7. 30 కోట్లు
కర్ణాటక                     –  62 కోట్లు
తమిళనాడు                – 4. 50 కోట్లు
కేరళ                        –  1. 60 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా          –  22 కోట్లు
ఓవర్ సీస్                     – 4. 50 కోట్లు

 మొత్తం                      –    101. 90 కోట్లు

English Title:  KGF five days Worldwide Collections