కంగనా రనౌత్ క్రిష్ ని దారుణంగా అవమానించిందట


Krish responds on Manikarnika controversy

టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ బాలీవుడ్ చిత్రం మణికర్ణిక కు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా నుండి సగంలోనే తప్పుకున్నాడు క్రిష్. అయితే ఇన్నాళ్లు పెద్దగా స్పందించని క్రిష్ అసలు వివాదం ఎలా వచ్చిందో , కంగనా ఎలా అవమానించిందో వివరంగా ఓ జాతీయ  మీడియాతో మాట్లాడుతూ వివరించాడు క్రిష్.

నేను 70 శాతానికి పైగా సినిమా తీశానని అయితే కంగనా ఒకరోజు నాకు ఫోన్ చేసి భోజ్ పురి సినిమాలా తీశావని , సీరియల్ కంటే దారుణంగా ఉందని చాలా అవమానకరంగా మాట్లాడిందని అందుకే మణికర్ణిక సినిమా నుండి తప్పుకున్నానని తెలిపాడు క్రిష్. సినిమా మొత్తం నేను తీస్తే నా పేరు ఎక్కడో మూలన వేసి తన పేరుని ప్రముఖంగా వేసుకుందని …… అసలు ఆమెకు నిద్ర ఎలా పడుతుందో అంటూ అసహనం వ్యక్తం చేశాడు క్రిష్. కంగనా రనౌత్ తో పాటుగా ఆచిత్ర నిర్మాతలు కూడా నాకు మద్దతుగా నిలవలేదు , పైగా నాకు ఇస్తానన్న రెమ్యునరేషన్ లో 30 శాతం మాత్రమే ఇచ్చారు అంటూ ఆరోపిస్తున్నాడు క్రిష్. దీనిపై కంగనా ఎలా స్పందిస్తుందో చూడాలి.

 

English Title: Krish responds on Manikarnika controversy