లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫిబ్రవరిలో రిలీజ్ అట


Lakshmi's ntr coming in february

లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే వివాదాస్పద చిత్రం ఫిబ్రవరిలో రిలీజ్ ఉంటుందని చెప్పకనే చెబుతున్నాడు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ . లక్ష్మీస్ ఎన్టీఆర్ అసలు షూటింగ్ జరుగుతోందా ? కేవలం హడావుడి మాత్రమే చేసున్నాడా ? అన్న అనుమానం ఉండేది అయితే ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ వర్కింగ్ స్టిల్ ఒకటి వదిలాడు వర్మ . అన్నగారి ఇంట్లో అందరూ భోజనం చేస్తున్న ఈ స్టిల్ తో షూటింగ్ జరుగుతోంది అని బలపడింది.

అయితే షూటింగ్ ఎంతవరకు వచ్చిందో కానీ రిలీజ్ మాత్రం ఫిబ్రవరిలో ఉంటుంది అని అంటున్నాడు వర్మ . ఎన్టీఆర్ బయోపిక్ బాలయ్య  తీసాడు కానీ అసలైన నిజాలు మా లక్ష్మీస్ ఎన్టీఆర్ లోనే ఉంటాయని అంటున్నాడు . ఈ నెలలోనే ట్రైలర్ రిలీజ్ చేసి ఫిబ్రవరిలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు వర్మ.

English Title: Lakshmi’s ntr coming in february