మందు పార్టీలో చిందేసిన మహేష్ – ఎన్టీఆర్


మందు పార్టీలో మందేసి చిందేసారు టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్ బాబు , ఎన్టీఆర్ లు . తాజాగా దర్శకులు  వంశీ పైడిపల్లి భార్య మాలిని పుట్టినరోజు సందర్బంగా పార్టీ ఇచ్చాడు కాగా ఆ వేడుకకు మహేష్ బాబు తన భార్య నమ్రతా తో కలిసి హాజరు కాగా ఎన్టీఆర్ కూడా తన భార్య లక్ష్మి ప్రణతి తో కలిసి వచ్చాడు . వంశీ పైడిపల్లి ఎన్టీఆర్ కు మంచి ఫ్రెండ్ అలాగే మహేష్ బాబు కు కూడా దాంతో వాళ్లిద్దరూ కూడా భార్యలతో కలిసి వచ్చారు . 
 
ఇంకేముంది పార్టీ అంటేనే మందు మగువ కాబట్టి మందులో రెచ్చిపోయారు చిందేశారు మహేష్ బాబు అలాగే జూనియర్ ఎన్టీఆర్ లు కూడా . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు తాజాగా మహర్షి అనే చిత్రంలో నటిస్తున్నాడు ఇక ఎన్టీఆర్ ఆల్రెడీ బృందావనం అనే చిత్రం చేసాడు . దాంతో మహేష్ – ఎన్టీఆర్ లతో మంచి అనుబంధం ఏర్పడింది వంశీ పైడిపల్లి కి . మహేష్ భార్య నమ్రత ఈ పార్టీకి చెందిన ఫోటోని తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది . ఇప్పుడా ఫోటో వైరల్ అవుతోంది .