మహర్షి పాటలు బాగోలేవు


మహర్షి పోస్టర్
మహర్షి పోస్టర్

మహేష్ బాబు నటించిన మహర్షి చిత్ర ఆడియో మొత్తం రిలీజ్ కాగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన విషయం తెలిసిందే . అయితే మహర్షి చిత్రంలోని పాటలు ప్రేక్షకులను అలరించేలా లేకపోవడంతో మహేష్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు . మహర్షి చిత్రంలో మొత్తం 6 పాటలుండగా అందులో రెండు పాటలు ” పదరా పదరా పదరా ” , ” పాలపిట్ట ” అనే రెండు పాటలు మాత్రమే బాగున్నాయి .

మిగతా నాలుగు పాటలు తెరమీద చూస్తే కానీ తేలేదు విజువల్స్ తో బాగుంటాయేమో కానీ వినడానికి మాత్రం ఆకట్టుకునేలా లేవు . దాంతో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మీద ఆగ్రహంగా ఉన్నారు మహేష్ అభిమానులు . దేవిశ్రీ ప్రసాద్ – మహేష్ బాబు ల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఆడియో పరంగా పెద్ద హిట్ అయ్యాయి కానీ వాటికీ భిన్నంగా మహర్షి ఆడియో ఉండటంతో మహేష్ అభిమానులకు కోపం వస్తోంది . ఇక దేవిశ్రీ ప్రసాద్ కూడా కొంత కాలంగా తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేయలేక పోతున్నాడు . మహర్షి విషయంలో కూడా అదే తప్పు జరిగింది . అయితే గుడ్డిలో మెల్ల లాగా రెండు పాటలు బాగున్నాయి .