మజిలీ తో సంచలనం సృష్టించిన నాగచైతన్య


మజిలీ చిత్రంతో నాగచైతన్య సంచలనం సృష్టించాడు నిన్న రిలీజ్ అయిన మజిలీ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు దాంతో మొదటి రోజున ఈ సినిమా ఏకంగా 7 కోట్లకు పైగా షేర్ ని సాధించింది . నాగచైతన్య కెరీర్ లోనే బెస్ట్ వసూళ్ల ని రాబట్టి సంచలనం సృష్టించింది మజిలీ . పెళ్లి కి ముందు సమంత – నాగచైతన్య లు నటించారు కానీ పెళ్లయ్యాక మాత్రం నటించిన మొదటి సినిమా దాంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి .

దానికి తోడు టీజర్ , ట్రైలర్ అలాగే పాటలు కుడి బాగుండటంతో మజిలీ చైతూ కెరీర్ లో మంచి నెంబర్ వన్ గా నిలిచేలా ఉంది . ఇక గతకొంత కాలంగా సరైన సినిమా లేక బాక్సాఫీస్ వెలవెలబోతోంది సరిగ్గా ఈ సమయంలో వచ్చిన మజిలీ బాక్సాఫీస్ దాహార్తి ని చల్లారేలా చేస్తోంది . శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బయ్యర్లకు మంచి లాభాలను తెచ్చిపెట్టేలా ఉంది .

ఇక ఏరియాల వారీగా మజిలీ వసూళ్లు ఇలా ఉన్నాయి .

నైజాం – 1. 95 కోట్లు

సీడెడ్ – 70 లక్షలు

ఉత్తరాంధ్ర – 76 లక్షలు

కృష్ణా – 37 లక్షలు

గుంటూరు – 68 లక్షలు

ఈస్ట్ – 28 లక్షలు

వెస్ట్ – 27 లక్షలు

నెల్లూరు – 17 లక్షలు

కర్ణాటక – 80 లక్షలు

రెస్ట్ ఆఫ్ ఇండియా – 30 లక్షలు

ఓవర్ సీస్ – 95 లక్షలు

మొత్తం – 7. 23 కోట్ల షేర్