హీరోల మగతనం ఇదేనా అంటూ సవాల్ చేస్తోంది


MeToo: Actress shraddha srinath attacks on superstars

సిల్వర్ స్క్రీన్ మీద ఒంటి చేత్తో పెద్ద పెద్ద వాహనాలను గాల్లో లేపేస్తూ , చెల్లెలు పై విలన్ లు అత్యాచారానికి పాల్పడితే ఎంతటి వీరులనైనా మట్టికరిపించే స్టార్ హీరోలు మీటూ ఉద్యమం పై స్పందించడం లేదు ఎందుకో అంటూ ఇదేనా మీ హీరోయిజం ? ఇదేనా మీ మగతనం అంటూ సవాల్ చేస్తోంది స్టార్ హీరోలను శ్రద్దా శ్రీనాథ్ . తెరమీద మీ హీరోయిజం కాదు , ఇప్పుడు చూపించరా ? అంటూ నేరుగా స్టార్ హీరోలను చాలెంజ్ చేస్తోంది ఈ భామ . గతకొద్ది రోజులుగా మీటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న విషయం తెలిసిందే . ఆ ఉద్యమంలో భాగంగా పలువురు నటీమణులు పలువురు సినీ ప్రముఖులపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు . అయితే ఎన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ స్టార్ హీరోలు మాత్రం అస్సలు స్పందించడం లేదు . దాంతో వాళ్ళని కించపరిచేలా కామెంట్ చేసింది శ్రద్దా శ్రీనాథ్ .

తెలుగు , తమిళ హీరోలు త్వరగా స్పందించండి , మీ స్పందన ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఆశగా ఎదురు చూస్తున్నాను అంటూ ట్వీట్ చేసింది శ్రద్దా శ్రీనాథ్ . దక్షినాదికి చెందిన ఈ భామ అంతగా సక్సెస్ కాలేదు కానీ మీటూ అంటూ స్టార్ హీరోలను కామెంట్ చేసి సంచలనం సృష్టించింది . మరి ఈ భామ వ్యాఖ్యల పట్ల స్టార్ హీరోలు ఎలా స్పందిస్తారో చూడాలి , అలాగే ఈ భామ పై పెద్ద ఎత్తున విమర్శలు కూడా రావడం సహజం ఎందుకంటే స్టార్ హీరోలకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి .

English Title: MeToo: Actress shraddha srinath attacks on superstars