అతడ్ని వెనకేసుకొచ్చి తప్పు చేసిన మోహన్ లాల్


mohan lal responds on dileep issue

మలయాళ స్టార్ హీరో వివాదాస్పద నటుడు అయిన దిలీప్ ని మళ్ళీ మలయాళీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లోకి తీసుకోవడంతో మోహన్ లాల్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పలువురు హీరోయిన్ లు అంతేకాదు ఓ అయిదుగురు అసోసియేషన్ కు రాజీనామా కూడా చేసారు . దాంతో పెద్ద ఎత్తున మోహన్ లాల్ పై విమర్శలు వస్తున్నాయి . మోహన్ లాల్ మలయాళీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు అధ్యక్షుడు పైగా హీరో దిలీప్ కు సన్నిహితుడు కూడా దాంతో స్నేహితుడి కోసం మోహన్ లాల్ అసోసియేషన్ ని తుంగలో తొక్కాడని , ఏకపక్ష నిర్ణయం తీసుకున్నాడని హీరోయిన్ లు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు .

అయితే ఈ విమర్శల ఘాటు ఎక్కువ కావడంతో ఎట్టకేలకు స్పందించాడు మోహన్ లాల్ . దిలీప్ ని మళ్ళీ అసోసియేషన్ లోకి తీసుకోవడమనే నిర్ణయం నా ఏకపక్ష నిర్ణయం కాదని సమావేశంలో అందరం కలిసే నిర్ణయం తీసుకున్నామని ఇప్పుడేమో బయటకు వచ్చాక నాపై విమర్శలు చేస్తున్నారని అయినప్పటికీ మళ్ళీ మేమెంతా కూర్చొని మనస్పర్థలను తొలగించుకుంటామని అంటున్నాడు .

హీరో దిలీప్ హీరోయిన్ భావన ని ఇబ్బంది పెట్టిన కేసులో అరెస్ట్ అవ్వడమే కాకుండా రెండు నెలలకు పైగా జైలుశిక్ష అనుభవించిన విషయం తెలిసిందే . ఆ సంఘటన దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది . అయితే అంతటి ఘాతుకానికి పాల్పడిన హీరో దిలీప్ ని అసోసియేషన్ నుండి అప్పట్లో బహిష్కరించారు , కాగా ఇప్పుడు బెయిల్ పై బయటకు వచ్చాడు కాబట్టి మళ్ళీ అసోసియేషన్ లోకి తీసుకున్నారు . అత్యంత హేయమైన సంఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న దిలీప్ ని వెనకేసుకొచ్చి మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ చాలా తప్పు చేసాడని విమర్శలు వస్తున్నాయి .

English Title: mohanlal response on dileep issue