హీరోకు వార్నింగ్ ఇచ్చిన పోలీసులు


Mumbai police warns Dulquer Salman
Dulquer Salman

మహానటి చిత్రంలో జెమిని గణేశన్ గా నటించి ప్రేక్షకుల మెప్పు పొందిన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ . అయితే తాజాగా ఈ హీరోకు  ముంబై పోలీసులు వార్నింగ్ ఇచ్చారు . దుల్కర్ సల్మాన్ కు ముంబై పోలీసులు వార్నింగ్ ఇవ్వడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? తాజాగా దుల్కర్ – సోనం కపూర్ జంటగా ” ది జోయా ఫ్యాక్టరీ ” అనే చిత్రంలో నటిస్తున్నారు . కాగా ఆ సమయంలో దుల్కర్ పై చిత్రీకరిస్తున్న సన్నివేశాన్ని షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సోనం దాంతో ఆగ్రహించిన పోలీసులు దుల్కర్ ని హెచ్చరించారు కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు సీటు బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని అలాగే మొబైల్ ని వాడొద్దని .

పోలీసుల వార్నింగ్ తో ఖంగుతిన్న దుల్కర్ అది సినిమా షూటింగ్ లో భాగంగా నేను కారులో కూర్చున్నాను , కారుని ట్రాలీ లాక్కెళ్ళే సీన్ మాత్రమే నేను డ్రైవ్ చేస్తూ సీటు బెల్ట్ పెట్టుకోకుండా మొబైల్ చూడటం నిజం కాదు కేవలం సినిమా కోసం తీస్తున్న సీన్ అది వివరంగా చెప్పాడు దాంతో నెటిజన్లు హీరో ని ఆటపట్టించిన హీరోయిన్ అంటూ నవ్వుకుంటున్నారు . అలాగే వెంటనే స్పందించిన ముంబై పోలీసులపై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు .

English Title: Mumbai police warns Dulquer Salman