జనసేనకు ఓటేస్తానంటున్న మంచు మనోజ్


 My vote for janasena says manchu manoj

మంచు మోహన్ బాబు తనయుడు హీరో మంచు మనోజ్ తన ఓటుని జనసేనకు వేస్తానని చెప్పి షాక్ ఇచ్చాడు . మంచు మోహన్ బాబు కుటుంబం తెలుగుదేశం మీద వ్యతిరేకతతో జగన్ ని భుజాల మీద మోస్తున్నారు అయితే మోహన్ బాబు , మంచు విష్ణు ల లాగే మనోజ్ కూడా జగన్ కు ఓటేస్తాడని అనుకున్నారు . కానీ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ పవన్ కళ్యాణ్ జనసేన కు ఓటేస్తానని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు మనోజ్ .

 

గతకొంత కాలంగా తిరుపతిలో ఉంటూ రాజకీయాలపై దృష్టి పెట్టాడు మనోజ్ అయితే జగన్ మనోజ్ కు టికెట్ ఇవ్వలేదు దాంతో కాబోలు జగన్ కు కాకుండా పవన్ కళ్యాణ్ కు ఓటేస్తానని అంటున్నాడు . ఇక జగన్ మంచు మోహన్ బాబు కుటుంబానికి బంధుత్వం ఉంది అలాగే తెలుగుదేశం అధినేత చంద్రబాబు తో కూడా మోహన్ బాబు కు బంధుత్వం ఉంది కానీ ఇప్పుడు వీళ్ళ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది .

English Title : My vote for janasena says manchu manoj