నాని కొత్త సినిమా ఎల్లుండే ప్రారంభం


జెర్సీ చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన నాని కొత్త సినిమాకు రెడీ అవుతున్నాడు . మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కనున్న మల్టీస్టారర్ చిత్రం ఈనెల 26 న ప్రారంభం కానుంది . కాగా ఈ చిత్రంలో నాని తో పాటుగా మహేష్ బాబు బావ హీరో సుధీర్ బాబు కూడా ఒక హీరోగా నటించనున్నాడు . నాని – సుధీర్ బాబు హీరోలు కాగా అదితి రావు హైదరీ , నివేదా థామస్ లు హీరోయిన్ లుగా నటించనున్నారు .

ఇంతకుముందు నాని – మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో ” అష్టా చెమ్మా ” , ” జెంటిల్ మెన్ ” చిత్రాలు రాగా ఇది మూడో సినిమా . ఇక సుధీర్ బాబు తో నాని కి ఇదే మొదటి సినిమా . అలాగే నివేదా థామస్ తో నాని కి ఇది మూడో సినిమా ఇంతకుముందు నాని నివేదా థామస్ ల కాంబినేషన్ లో జెంటిల్ మెన్ , నిన్ను కోరి చిత్రాలు వచ్చాయి . జెర్సీ తో సూపర్ హిట్ అందుకున్న నాని అప్పుడే మరో కొత్త సినిమా పట్టాలెక్కిస్తున్నాడు .