సెన్సార్ పూర్తిచేసుకున్న ఎన్టీఆర్ బయోపిక్NTR biopic censor completed
Balakrishna

ప్రతిష్టాత్మక చిత్రం ” ఎన్టీఆర్ బయోపిక్ ” లోని మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు సెన్సార్ కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తిచేసుకుంది ఈరోజు . హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని చూసారు సెన్సార్ సభ్యులు అయితే టాక్ మాత్రం ఇంకా బయటకు రాలేదు . దర్శక నిర్మాతలు మాత్రం ఎన్టీఆర్ బయోపిక్ వండర్స్ క్రియేట్ చేయడం ఖాయమని ధీమాగా ఉన్నారు .

2019 జనవరి 9న ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా విడుదల కానుంది . ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య నటించగా ఇతర ముఖ్య పాత్రల్లో విద్యాబాలన్ , కళ్యాణ్ రామ్ , రానా , సుమంత్ తదితరులు నటించారు . క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రానికి క్లీన్ యు సర్టిఫికెట్ రావడం ఖాయం ఎందుకంటే మొదటి భాగంలో వివాదాస్పద అంశాలు పెద్దగా లేవు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు కాకపోతే ఎన్టీఆర్ మహానాయకుడు లో మాత్రం వివాదాస్పద అంశాలు ఉన్నాయి కాబట్టి అది వివాదం కావచ్చు . ఇక సెన్సార్ టాక్ ఎలా ఉందో ఈరోజు రాత్రికి తెలిసే అవకాశం ఉంది .

English Title: NTR biopic censor completed