ఎన్టీఆర్ కథానాయకుడు రివ్యూ


NTR Kathanayakudu movie review
ఎన్టీఆర్ కథానాయకుడు రివ్యూ

ఎన్టీఆర్ కథానాయకుడు రివ్యూ :
నటీనటులు : నందమూరి బాలకృష్ణ , విద్యాబాలన్ , కళ్యాణ్ రామ్ , రానా తదితరులు
సంగీతం : ఎం ఎం కీరవాణి
నిర్మాతలు : వసుంధరాదేవి , బాలకృష్ణ
దర్శకత్వం : క్రిష్
రేటింగ్ : 3. 5/ 5
రిలీజ్ డేట్ : 9జనవరి 2019

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ” ఎన్టీఆర్ కథానాయకుడు ”. నందమూరి బాలకృష్ణ , విద్యాబాలన్ , సుమంత్ , రానా , కళ్యాణ్ రామ్ తదితరులు నటించిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది . మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరించేలా ఉందా ? లేదా ? అన్నది చూద్దామా !

కథ :

రామారావు ( నందమూరి బాలకృష్ణ ) కు రిజిస్ట్రార్ ఆఫీసులో ఉద్యోగం వస్తుంది అయితే లంచాలకు వ్యతిరేకమైన రామారావు ఆ ఉద్యోగాన్ని వదిలేసి సినిమా హీరో అవుతానని మద్రాస్ వెళ్తాడు . అక్కడ మద్రాస్ లో హీరోగా నిలదొక్కు కోవడానికి రామారావు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి ? ఎలా హీరోగా సక్సెస్ అయ్యాడు . ప్రజల నీరాజనాలను అందుకున్న సూపర్ స్టార్ గా ఎలాంటి సవాళ్ళని అధిగమించాడు . తనని ఇంతవాడిని చేసిన తెలుగు ప్రజల కోసం ఏం చేయడానికి సిద్ధపడ్డాడు అన్నది మొదటి భాగం గా చిత్రీకరించారు .

హైలెట్స్ :

నందమూరి బాలకృష్ణ
విద్యాబాలన్
సుమంత్
కళ్యాణ్ రామ్
సంగీతం
మాటలు
ఎమోషనల్ సీన్స్

డ్రా బ్యాక్స్ :

ఫస్టాఫ్ లో కొన్ని సీన్స్
బాలయ్య యంగ్ గెటప్

 

నటీనటుల ప్రతిభ :

నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసారు అనడంలో సందేహం లేదు . ఎన్టీఆర్ పోషించిన పాత్రలను ఈ ఒక్క చిత్రంలోనే పోషించి మెప్పించాడు . అయితే ఫస్టాఫ్ లో కొన్ని సన్నివేశాల్లో బాలయ్య ముఖ కవళికల్లో ముదురుతనం కొట్టొచ్చినట్లు కనబడింది . సెకండాఫ్ లో మాత్రం అద్భుతమనే చెప్పాలి . ఇంకా హైలెట్ ఏంటంటే బాలయ్య – విద్యాబాలన్ ల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడం ఖాయం . బాలయ్య తర్వాత విద్యాబాలన్ కే అగ్రతాంబూలం దక్కనుంది . బసవ తారకం పాత్రని అద్భుతంగా పోషించి మెప్పించింది విద్యాబాలన్ . ఇక మరో హైలెట్ సుమంత్ అక్కినేని పాత్రలో జీవించడం . హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ బాగున్నాడు , మెప్పించాడు కూడా . రానా చంద్రబాబు పాత్రలో అబ్బుర పరిచాడు .

సాంకేతిక వర్గం :

బాలయ్య బలం , బలహీనత ఏంటో బాగా తెలిసిన దర్శకులు క్రిష్ ఆ బలాన్ని మరింతగా చూపించాడు . అక్కడక్కడా సాగతీత సన్నివేశాలు ఉన్నప్పటికీ బయోపిక్ కు పూర్తి న్యాయం చేసాడు క్రిష్ . ముఖ్యంగా బాలయ్య శ్రీ కృష్ణుడి గెటప్ లో అందంగా ఉన్నాడంటే అందుకు ఖచ్చితంగా క్రిష్ ని అభినందిన్చాల్సిందే . ముఖ్యంగా బాలయ్య అభిమానులతో పాటుగా నందమూరి అభిమానులకు ఈ సినిమా పెద్ద పండగ ఇచ్చిందనే చెప్పాలి . కీరవాణి నేపథ్య సంగీతం ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది . పాటలతో పాటుగా నేపథ్య సంగీతం తో ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని మరో లెవల్ లో నిలబెట్టాడు కీరవాణి . జ్ఞానశేఖర్ అద్భుతమైన విజువల్స్ అందించాడు . సాయి మాధవ్ బుర్రా మనసుని తాకేలా సంభాషణలు అందించాడు . నిర్మాణ విలువలు బాగున్నాయి .

ఓవరాల్ గా :

అందరికీ నచ్చే సినిమా మెచ్చే సినిమా ఎన్టీఆర్ కథానాయకుడు

English Title: NTR Kathanayakudu movie review

                     Click here for English Review