భారీ డిజాస్టర్ అయిన ఎన్టీఆర్ కథానాయకుడు


NTR kathanayakudu towards disaster

నందమూరి బాలకృష్ణ నటిస్తూ నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం ” ఎన్టీఆర్ కథానాయకుడు ”. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి బరిలో జనవరి 9న విడుదలైంది . అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఘోర పరాజయం దిశగా దూసుకుపోతోంది . కేవలం 20 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది ఎన్టీఆర్ కథానాయకుడు . వారం రోజులు పూర్తయ్యాయి కానీ కలెక్షన్లు మాత్రం 20 కోట్లు దాటలేదు దాంతో ఎన్టీఆర్ కథానాయకుడు డిజాస్టర్ అనేది ఖాయమైపోయింది .

రోజు రోజుకి కలెక్షన్లు తగ్గుముఖం పడుతున్నాయి తప్ప ఎక్కడా పెరగడమే లేదు దాంతో ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి తీసిన బయోపిక్ లో మొదటి భాగం డిజాస్టర్ కావడంతో ఖంగుతిన్న బాలయ్య ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాన్ని ఫిబ్రవరి 7న కాకుండా మరో వారం రోజులు పొడిగించాడు . ఇక ఈ రెండో భాగం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో కానీ మొదటి భాగాన్ని కొన్న బయ్యర్లకు చుక్కలు కనబడుతున్నాయి .

English Title: NTR kathanayakudu towards disaster