మళ్ళీ మహానటి సావిత్రిగా కీర్తి సురేష్


once again keerthi suresh as mahanati savitri

ఇప్పటికే మహానటి చిత్రంలో సావిత్రిగా నటించి మెప్పించింది కీర్తి సురేష్ కాగా మళ్ళీ మహానటి సావిత్రిగా కీర్తి సురేష్ నటించడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? తాజాగా నటసింహం నందమూరి బాలకృష్ణ క్రిష్ దర్శకత్వంలో ” ఎన్టీఆర్ ” బయోపిక్ చేస్తున్న విషయం తెలిసిందే . ఎన్టీఆర్ సినిమా అనగానే మహానటి సావిత్రి పాత్ర తప్పకుండా ఉంటుంది పైగా ఈ ఇద్దరి కాంబినేషన్ లో పలు సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి కాబట్టి సావిత్రి పాత్ర తప్పనిసరి అయ్యింది . ఇంకేముంది సావిత్రి పాత్రలో ఇంకా ఎవరినో తీసుకునే బదులు కీర్తి సురేష్ నే నటించమని కోరారట దర్శకులు క్రిష్ .

మహానటి చిత్రంలో నటించి ఎనలేని కీర్తి ప్రతిష్టలు పొందింది కీర్తి సురేష్ , కాగా ఆమె పాత్రనే మరోసారి పోషించే అదృష్టం రావడంతో మరో మాట లేకుండా ఒప్పేసుకుందట ! ఇక అక్కినేని నాగేశ్వర్ రావు పాత్రలో మనవడు సుమంత్ నటించనున్నాడు . జులై 5 నుండి ఎన్టీఆర్ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది అయితే మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు పాత్రని నెగెటివ్ షేడ్ లో చూపించబోతున్నారని కోర్టు నోటీసులు పంపారు . అది ఇంకా క్లియర్ కాలేదు మరి , బాలయ్య నటిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా విద్యా బాలన్ ఎన్టీఆర్ భార్య గా నటించనుంది . అన్ని అడ్డంకులు తొలగితే 2019 జనవరి 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .