మలయాళ నటికి తృటిలో తప్పిన భారీ ప్రమాదం


parvathy great escape from car accident

మలయాళ నటి పార్వతి భారీ ప్రమాదం నుండి తృటిలో తప్పించుకుంది . పార్వతి ప్రయాణిస్తున్న కారు వేగంగా వెళ్లి మరో కారు ని గుద్దడం వల్ల రెండు కార్లు కూడా స్వల్పం గా దెబ్బతిన్నాయి . అయితే కారులో ప్రయాణిస్తున్న వాళ్లకు పెద్దగా గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు . మలయాళ నటి అయిన పార్వతి ఇన్నోవా వాహనంలో కొచ్చి నుండి త్రివేండ్రం కు వెళుతోంది . అయితే పార్వతి ప్రయాణిస్తున్న కారు ఆలా పుజా సమీపంలో ఒక్కసారిగా యాక్సిడెంట్ కి గురవ్వడంతో షాక్ అయ్యింది .

పెద్ద ప్రమాదం లో పడ్డానని అనుకుంది పార్వతి కానీ గాయాలు పెద్దగా కాకపోవడంతో ఊపిరి పీల్చుకుంది . పార్వతి కమల్ హాసన్ నటించిన ” ఉత్తమ విలన్ ” చిత్రంలో నటించింది . టేకాఫ్ అనే చిత్రంలో ఉత్తమ నటనని కనబరిచినందుకు పార్వతి కి జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించడమే కాకుండా జాతీయ ఉత్తమ నటి అవార్డు సైతం వరించింది .